జగన్ సర్కార్‌కు షాక్ ఇచ్చిన టాలీవుడ్ నిర్మాత.. హైకోర్టులో పిటీషన్..!

Tuesday, September 29th, 2020, 07:23:47 AM IST

జగన్ సర్కార్‌కు మరో షాక్ తగిలింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ జగన్ ప్రభుత్వంపై హైకోర్టుకు వెళ్ళారు. గన్నవరంలోని తన భూమికి సంబంధించి నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ అశ్వినీదత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే గతంలో గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం అశ్వినీదత్ తన 40 ఎకరాల భూమిని ప్రభుత్వ ఒప్పందం ప్రకారం భూసేకరణ కాకుండా, భూ సమీకరణ కింద ప్రభుత్వానికి ఇచ్చారు.

అయితే భూసమీకరణ కింద ఇచ్చిన భూమికి బదులుగా సీఆర్డీయే పరిధిలో అశ్వినీదత్‌కు గత ప్రభుత్వం భూమిని కేటాయించింది. కాగా వైసీపీ ప్రభుత్వం సీఆర్డీఏ పరిధి నుంచి రాజధానిని జగన్ ప్రభుత్వం తప్పించడంతో, ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ గన్నవరం విమానాశ్రయ విస్తరణను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేస్తూ పిటీషన్ దాఖలు చేశారు. అంతేకాదు గన్నవరంలో తాను ఇచ్చిన భూమిని తిరిగి ఇవ్వాలని, లేదంటే భూసేకరణ కింద నాలుగు రెట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. తాను ఇచ్చిన 39 ఎకరాలకు రూ.210 కోట్లు చెల్లించి తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ఎయిర్‌పోర్టు అథారిటీని పార్టీలుగా చేరుస్తూ అశ్వినీదత్‌ పిటిషన్‌ వేశారు. ప్రస్తుతం తాను ఇచ్చిన భూమి రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఎకరం రూ.కోటి 84 లక్షలకు చేరుకుందని ల్యాండ్‌ సేకరణ కింద తన భూమికి 4 రెట్లు చెల్లించి ఏపీ ప్రభుత్వం లేదా ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా అందులో నిర్మాణాలు చేపట్టుకోవచ్చని పిటీషన్‌లో తెలిపారు.