కరోనా వైరస్ వాక్సిన్ పనితీరు పై అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు

Monday, April 5th, 2021, 04:48:52 PM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. దేశం లో నిన్న ఒక్క రోజే లక్ష కి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే పాజిటివ్ కేసుల పెరుగుదల తో ప్రజలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మహమ్మారి కి వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాక్సిన్ వచ్చినప్పటికీ కూడా పలు అనుమానాలు ఉన్నాయి. అయితే కరోనా వైరస్ వాక్సిన్ తీసుకున్న ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వాక్సిన్ పనితీరు పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినప్పటికీ ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు లేవని అరవింద్ అన్నారు. మొదటి డోస్ కరోనా వాక్సిన్ తీసుకున్న తర్వాత తన స్నేహితుల తో కలిసి ఊరు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. అయితే ముగ్గురికి కూడా పాజిటివ్ నిర్దారణ అయ్యింది అని, అయితే ముగ్గురి లో ఇద్దరం సేఫ్ గా ఉన్నాం అంటూ చెప్పుకొచ్చారు. ఇద్దరం వాక్సిన్ తీసుకున్నాం అని, ఒకరు ఆసుపత్రి లో అడ్మిట్ అయ్యారు అని తెలిపారు. వాక్సిన్ వేయించుకోవడం కారణం గా ఎలాంటి ప్రభావం లేదు అని,సేఫ్ గా ఉన్నాం అని వ్యాఖ్యానించారు. అయితే అందరూ కూడా వాక్సిన్ వేయించుకోవాలి అని, రెండు డోసు లు వేయించుకున్న వారికి యాంటీబాడీలు మరింత ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకొచ్చారు. వాక్సిన్ వేయించుకోవడం ద్వారా మనల్ని మనం కాపాడుకుంటాం అని, అంతేకాక మన ద్వారా ఇతరులకు కూడా సోకకుండా ఉంటుంది అని తెలిపారు.