గాంధీయేతర కుటుంబం నుంచే అధ్యక్షుడు.. ప్రియాంక కీలక వ్యాఖ్యలు..!

Thursday, August 20th, 2020, 12:17:38 AM IST

దేశంలో బీజేపీ దెబ్బకి కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మొదట్లో రాహుల్ గాంధీ అధ్యక్షతన పార్టీ మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉంటాయని అందరూ భావించినా 2019 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రెండో సారి అధికారం కోల్పోవడంతో ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు.

అయితే రాహుల్ గాంధీ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఎవరనేది అంతులేని ప్రశ్నగా మిగిలింది. ప్రస్తుతానికి సోనియా గాంధీ తాత్కాళికంగా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తుంది. అయితే ఇటీవల దేశ రాజకీయాలలో చురుగ్గా కనిపిస్తున్న ప్రియాంక గాంధీ పార్టీ పగ్గాలు చేప్పట్టే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అయితే తాజాగా అధ్యక్ష పదవిపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేసింది. గాంధీయేతర కుటుంబం నుంచి పార్టీకి అధ్యక్షుడు వస్తారని, ఆ అధ్యక్షుడి కింద పనిచేయడానికి నేను సిద్దం అని అన్నారు. నా బాస్ అప్పుడు నాకు ఏ రాష్ట్ర బాధ్యతలు అయినా అప్పగించవచ్చు అని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఎవరనేది తెలీదు కానీ ప్రియాంక వ్యాఖ్యలతో ఇకపై గాంధీ కుటుంబం నుంచి అధ్యక్షుడు ఉండరని మాత్రం క్లారిటీ వచ్చింది.