సల్మాన్ కోసం ఏదైనా చేస్తుందట!

Thursday, April 16th, 2015, 11:25:13 PM IST

preeti
ప్రముఖ బాలీవుడ్ నటీమణి ప్రీతీ జింటా కొంత కాలం నుండి బిజినెస్ లో విరామం లేకుండా గడిపి తాజాగా ‘నాచ్ బలియే 7’ అనే రియాలిటీ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాన్స్ అంటే తనకు ఇష్టమేనని అయితే ఇంట్లో కాని లేదా క్లబ్ కి వెళ్ళినప్పుడు గాని చేస్తానని చెప్పుకొచ్చింది. అలాగే తనకు తన మిత్రుడు, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అంటే ఎంతో ఇష్టమని, అతని కోసం ఏమైనా చేస్తానని ప్రీతి తెలిపింది.

ఇక సల్మాన్ పైన ఇష్టంతోనే అతను అడగ్గానే గతంలో ఒక సినిమా ఐటెం సాంగ్ కు నర్తించానని ప్రీతి పేర్కొంది. అయితే తాను ఐటెం నెంబర్స్ చేసే వ్యక్తిని కానని, నటిని మాత్రమే నని ప్రీతి జింటా వివరించింది. ఇక ఐపీఎల్ కు ప్రాచుర్యం తెచ్చేందుకు గత ఎనిమిది సంవత్సరాలుగా కృషి చేసానని, వ్యాపారం బాగా సాగుతోందని, తన టీం మంచి ప్రదర్శను ఇస్తోందని, ఇప్పుడు తాను కేవలం ఆట చూడడానికి మాత్రమే వస్తున్నానని, ఇకపై ఐపీఎల్ కు తాను అక్కరలేదని ప్రీతి జింటా పేర్కొంది.