హాట్ టాపిక్: ఈ క్రేజీ డైరెక్టర్ తో నెక్స్ట్ చేసేది ఎవరు?

Monday, November 30th, 2020, 06:37:38 PM IST

కేజీఎఫ్ చిత్రం తో కేవలం సౌత్ ఇండియా ను మాత్రమే కాకుండా, యావత్ భారత దేశ సినీ పరిశ్రమ ను ఆకట్టుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే ఈ దర్శకుడు కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్ కేజీఎఫ్ చాప్టర్ 2 ను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఈ దర్శకుడు తెలుగు టాలెంటెడ్ హీరోలతో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా ఫిక్స్ అంటూ వార్తలు వచ్చాయి. ప్రశాంత్ నీల్ సైతం ఈ విషయాల పై అనుకూలం గా స్పందించారు. అయితే ఇప్పుడు ఈ దర్శకుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను కలిసినట్లు సమాచారం.

అయితే ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో కూడా సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరిద్దరికీ సంబంధించిన చిత్ర అప్డేట్ ను ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ విడుదల అయ్యాక ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభాస్ సైతం ఇప్పటికే వరుస ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టేశారు. రాధే శ్యామ్ అనంతరం, ఆదిపురుష్ ఉండగా, ఆ నెక్స్ట్ నాగ్ అశ్విన్ తో చేయనున్నారు. అయితే ఇప్పుడు తెరపైకి ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేయనున్నారు అని వార్తలు రావడం తో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరో పక్క ఎన్టీఆర్ మరియు ప్రభాస్ లతో దర్శకుడు ప్రశాంత్ నీల్ మల్టీ స్టారర్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి దీని పై క్లారిటీ రావాలంటే వేచి చూడాల్సిందే.