బ్రేకింగ్ : ప్రశాంత్ కిషోర్ సొంత పార్టీ పెడుతున్నారా…?

Thursday, February 13th, 2020, 10:29:46 PM IST

దేశ రాజకీయాల్లో సంచలనాలను సృష్టిస్తున్నటువంటి ప్రశాంత్ కిషోర్ పేరు తెలియని వారు ఎవరు లేరంటే అతిశయోక్తి కాదు. దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వైసీపీ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసుకోడానికి కారణమైన ప్రశాంత్ కిషోర్ కి సంబందించిన ఒక లేటెస్ట్ వార్త ప్రస్తుతానికి సామాజిక మాంద్యమాల్లో, దేశరాజకీయాల్లో కూడా బాగా హల్చల్ అవుతుంది. ఇంతకీ అసలు విషయం ఏంటి అంటే… ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ తాజాగా ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని సమాచారం.

కాగా బీహార్‌కు చెందిన ప్రశాంత్ కిశోర్ బీజేపీలోని జేడీయూ నుంచి బహిష్కరణ అనంతరం కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉన్న ప్రశాంత్ కిశోర్ త్వరలో ఒక రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారని, ఈ నేపథ్యంలో ఈ నెల 18 న చేయబోయే ప్రకటన కీలకంగా మారనుందని సమాచారం. అయితే ఇన్ని రోజులుగా తెర వెనక ఉండి రాజకీయాలను నడిపించిన ప్రశాంత్ కిషోర్, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. కానీ ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది…