సీఎం జగన్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. ఏం చర్చించారంటే..!

Friday, January 8th, 2021, 10:00:01 PM IST

ఏపీ సీఎం జగన్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. వైసీపీ అధికారంలోకి రావడంలో ప్రశాంత్ కిషోర్‌ కీలక పాత్ర పోశించిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో ప్రస్తుతం ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో పాటు త్వరలో తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కాబోతున్న నేపధ్యంలో సీఎం జగన్, పీకే భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

అయితే వైసీపీ అధికారాన్ని చేపట్టి ఏడాదిన్నర పూర్తయ్యింది. అయితే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో స్పందన ఎలా వస్తుందన్న విషయాన్ని కూడా సీఎం జగన్ పీకేను అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. ఇదే కాకుండా విగ్రహాల ధ్వంసం ఘటనలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కూడా ధీటుగా సమాధానం చెప్పాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. తిరుపతి ఉప ఎన్నికపై విగ్రహాల ధ్వంసం ఘటనల ప్రభావం లేకుండా ఉండేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ప్రశాంత్ కిషోర్‌తో జగన్ చర్చించినట్లు సమాచారం.