ప్రణబ్ ముఖర్జీ మరణం: దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాప దినాలు

Monday, August 31st, 2020, 10:09:24 PM IST

Pranab-Mukherjee

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం దేశ వ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు, విశ్లేషకులు, ప్రజలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్రం ఈ మేరకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రణబ్ ముఖర్జీ సేవలను స్మరించుకునేందుకు దేశ వ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలి అని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పతి భవన్, పార్లమెంట్ నుండి అన్ని కార్యాలయాల పైన జాతీయ జెండా ను అవనతం చేయడం జరిగింది.

ప్రణబ్ ముఖర్జీ కి అధికారిక లాంచనలతో వీడ్కోలు పలికేందుకు రక్షణ శాఖ తగు ఏర్పాట్లను చేస్తోంది. సైనిక గౌరవ వందనం తో వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీ కి మెదడులో ఉన్న కణితి కారణం గా శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే, అంతేకాక కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడం తో ఆరోగ్యం మరింత గా క్షీణించింది. గత కొద్ది రోజుల నుండి చికిత్స పొందుతున్న ఆయన నేడు ప్రాణాలను కోల్పోయారు.