ప్రకాశం జిల్లా కలెక్టర్ పై మంత్రి కి ఫిర్యాదు చేసిన ప్రజలు…కారణం ఇదే!

Friday, October 16th, 2020, 01:29:24 PM IST

ప్రకాశం జిల్లా కలెక్టర్ తీరు పై ఆ ప్రాంత ప్రజలు మంత్రి ఆడిమూలపు సురేష్ వద్దకు తీసుకు వెళ్ళారు. అయితే అక్కడి దళిత సంఘాల నేతలు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ పై మంత్రి కి ఫిర్యాదు చేశారు. ప్రజల సమస్యలు చెప్పుకునేందుకు వెళ్తే తమను ఛాంబర్ లోపలికి కూడా రానివ్వలేదు అని ఆధిమూలపు సురేష్ కు విన్నవించుకున్నారు. అయితే జాయింట్ కలెక్టర్ చేతన్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు కు కుల ధృవీకరణ పత్రాలు అడుగుతున్నారు అని మంత్రి ముందు ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

భారత దేశంలోనే ఇలాంటి పరిస్తితి ఎక్కడా లేదు అని, తమ సమస్యల పరిష్కారం కొరకు ప్రత్యేక కలెక్టర్ ను నియమించాలి అని దళిత సంఘాల నేతలు మంత్రి గారిని కోరారు. అయితే వారి సమస్యలు విన్న అనంతరం మంత్రి కలెక్టర కి ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. మరి దీని పై మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.