ప్రభుదేవా సినిమా నిర్మాత కళ్యాణ్ చేతికి ?

Friday, July 20th, 2018, 11:16:09 AM IST

డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా ముఖ్య పాత్రలో .. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం లక్ష్మి. డాన్స్ నేపథ్యంలో బాలల చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ చేతికి వచ్చింది. ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను త్వరలో విడుదల చేయనున్నారు. హిందీలో దర్శకుడిగా ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభుదేవా కు అక్కడ వరుస పరాజయాలు పలకరించడంతో కాస్త గ్యాప్ ఇచ్చి తమిళం పై దృష్టి పెట్టాడు. ఇక్క అభినేత్రి, గులేబకావలి కథ లాంటి సినిమాలు చేసిన ఆయనకు ఇక్కడ పరిస్థితి అలాగే మారింది. తాజాగా డాన్స్ నేపథ్యంలో ఏ ఎల్ విజయ రూపొందిస్తున్న లక్ష్మి సినిమాలో గెస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభుదేవాకు మార్కెట్ బాగా తగ్గడంతో ఈ సినిమా విడుదల ఆలస్యం అయింది. ఈ నేపథ్యంలో ఈ తెలుగు హక్కులను నిర్మాత సి కళ్యాణ్ తీసుకోవడం విశేషం. ఇక నిర్మాత సి కళ్యాణ్ ఈ మద్యే వినాయక్ దర్శకత్వంలో సాయి ధరమ్ తో చేసిన ఇంటిలిజెంట్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం అయన బాలకృష్ణ తో వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు.