సలార్ మొదటి షెడ్యూల్ అప్పటి నుండేనా?

Monday, January 25th, 2021, 04:31:47 PM IST

యంగ్ రెబల్ స్టార్, బాహుబలి ప్రభాస్ సలార్ చిత్రం షూటింగ్ లో పాల్గొనేందుకు ఆతృత గా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇప్పటికే హైదరాబాద్ లో జరిగాయి. అయితే ఈ చిత్రానికి దర్శకుడు ప్రశాంత్ నీల్ అవ్వడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ లుక్ తోనే చిత్రం పై హైప్స్ పెంచేశాడు ప్రశాంత్. అయితే రాధే శ్యామ్ చిత్రం షూటింగ్ పూర్తి అవ్వడం తో ప్రభాస్ ఈ చిత్రం లో ఎప్పుడెప్పుడు పాల్గొంటాడా అంటూ అభిమానులు కూడా ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ తెలంగాణలోనే జరగనున్నట్లు తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ పెద్దపల్లి జిల్లా లో రామగుండం లో జరగనున్నట్లు సమాచారం. అయితే ఈ నెల 29 నుండి ఫిబ్రవరి 12 వరకూ ఈ చిత్రం కి సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు అని తెలుస్తోంది. అయితే ప్రభాస్ తో పాటుగా ఈ చిత్రంలో చాలా మంది కీలక నటులు ఈ షెడ్యూల్ లో పాల్గొన నున్నారు. అయితే ఈ చిత్రం పాన్ ఇండియా గా తెరకెక్కనుంది. ఈ చిత్రం విడుదల కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.