“రాధే శ్యామ్” ఫస్ట్ గ్లింప్స్ లో అది ఉంటుందా?

Friday, February 12th, 2021, 05:40:27 PM IST

ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఈ సినిమా లో విక్రమాదిత్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఎప్పుడెప్పుడా అంటూ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే ఫస్ట్ లుక్, మోషన్ పిక్చర్ అభిమానులను ఎంతగానో అలరించాయి. అయితే లవర్ బోయ్ గా ప్రభాస్ కనిపించనున్నారు. ప్రభాస్ కి తొలిసారిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. యూ వి క్రియేషన్స్ మరియు టీ సీరీస్ బ్యానర్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ఫిబ్రవరి 14 వ తేదీన ఉదయం 9:18 గంటలకు విడుదల కానుంది. అయితే ఈ టీజర్ లో ప్రభాస్ డైలాగ్ ఉంటుందా అంటూ పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభాస్ బాహుబలి తర్వాత నేషనల్ స్టార్ గా ఎదగడం తో సాహో చిత్రం నుండి, రాబోయే చిత్రాలు కూడా అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కనున్నాయి. అయితే ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ మరియు సలార్ చిత్రాల లో నటిస్తూ బిజీ గా ఉన్నారు. అనంతరం నాగ్ అశ్విన్ దర్శకత్వం లో సైన్స్ ఫిక్షన్ చిత్రం లో నటించనున్నారు. ఈ చిత్రం పాన్ వరల్డ్ సినిమా గా విడుదల కానుంది.