“బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్” అదుర్స్ అంటున్న అభిమానులు!

Friday, October 23rd, 2020, 01:19:55 PM IST

ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రాధే శ్యామ్ చిత్ర యూనిట్ చెప్పినట్లుగా నే బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ పేరుతో ఒక మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్ విజువల్స్ ఎంతగా ఆకట్టుకున్నాయో, మ్యూజికల్ బీట్ కూడా సూపర్ అనేలా ఉంది. డార్లింగ్ ప్రభాస్ అభిమానులు ఈ మోషన్ పోస్టర్ పై కామెంట్స్ చేస్తున్నారు. బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ అదుర్స్ అని అంటున్నారు.

ప్రభాస్ పుట్టిన రోజున స్పెషల్ సర్ప్రైజ్ రావడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం లో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో నటిస్తుండగా, హీరోయిన్ పూజ హెగ్డే ప్రేరణ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ సా హో చిత్రం తర్వాత చేస్తున్న సినిమా కావడం తో బాలీవుడ్ లో సైతం దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది అని చెప్పాలి. వింటేజ్ ప్రేమ కథా చిత్రమ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ను జిల్ ఫేమ్ రాధ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. యూ వి బ్యానర్స్ పై వంశీ కృష్ణా రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ఇటలీ లో జరుగుతున్న సంగతి తెలిసిందే.