“రాధే శ్యామ్” లో విక్రమాదిత్య గా స్టన్నింగ్ లుక్ తో అదరగొట్టిన ప్రభాస్..!

Wednesday, October 21st, 2020, 11:59:19 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న రాధే శ్యామ్ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. రాధే శ్యామ్ వింటేజ్ ప్రేమ కథా చిత్రం గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రం నుండి విడుదల అయిన పూజ హెగ్డే ఫస్ట్ లుక్ ఇప్పటికే అభిమానులను అలరించగా, ప్రభాస్ ను విక్రమాదిత్య గా ఇంట్రడ్యూస్ చేస్తూ చిత్ర యూనిట్ సర్ప్రైజ్ ఇచ్చింది.

ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈలోగా, అడ్వాన్స్ విషెస్ అంటూ ప్రభాస్ కి సంబంధించిన మరొక స్టన్నింగ్ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అల్ట్రా క్లాస్ లుక్ లో కనిపిస్తున్న ప్రభాస్, అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఉదయం 11:31 సర్ప్రైజ్ అంటూ చిత్ర యూనిట్ ప్రకటించగా, ప్రభాస్ లుక్ ను విడుదల చేయడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ లుక్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిత్రం లో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, జిల్ ఫేమ్ రాధ కృష్ణ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు లో మాత్రమే కాకుండా హిందీ,తమిళ, కన్నడ భాషల్లో కూడా తెరకెక్కుతున్న ఈచిత్రం పాన్ ఇండియన్ మూవీ గా విడుదల అయ్యేందుకు సిద్దం గా ఉంది.