ఆదిపురుష్ ఆరంభ్…చిత్ర యూనిట్ ప్రకటన

Tuesday, February 2nd, 2021, 12:44:25 PM IST

పాన్ ఇండియా స్టార్ హీరో, బాహుబలి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆది పురుష్ లో నటిస్తున్నారు. ఈ చిత్రం మంగళవారం నాడు షూటింగ్ ప్రారంభం అయింది. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రభాస్ సైతం ఇన్స్టా లో పోస్ట్ చేశారు. ఈ రోజు నుండి ముంబై లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. పాన్ ఇండియన్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పౌరాణిక రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. తెలుగు లో మాత్రమే కాకుండా,హిందీ, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని 3డీ లో తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ చిత్రం లో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నారు. సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే ప్రభాస్ సలార్ చిత్రం షూటింగ్ ప్రారంభం అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదిపురుష్ కూడా పట్టాలు ఎక్కడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్ 11 న విడుదల కానుంది.