బిగ్ అనౌన్స్‌మెంట్: ప్రభాస్ 21 సినిమాలో అమితాబ్..!

Friday, October 9th, 2020, 11:51:17 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మహానటి ఫేం నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సైన్స్ ఫిక్షన్ కథాంశంతో భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించబోతున్నారు. అయితే ఈ సినిమా ప్రభాస్‌కి 21 వ చిత్రం కావడం విశేషం. అయితే ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ రాబోతుంది అంటూ నిన్న చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే అందరూ అనుకున్నట్టుగానే ఈ సినిమాకి సంబంధించి ఈ రోజు బిగ్ అనౌన్స్‌మెంట్ ప్రకటించింది వైజయంతి మూవీస్. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నట్టుగా తెలిపింది. కోట్లాది మంది భారతీయులకు గర్వకారణమైన నటుడిని మనస్పూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం అంటూ ఇప్పుడు మా ప్రయాణం మరింత పెద్దదయింది అని ట్వీట్ చేశారు. ఏదేమైనా ప్రభాస్ సినిమాలో అమితాబ్ నటిస్తున్నాడు అనగానే సినిమాపై ప్రేక్షకులలో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.