సీఎం జగన్ బీసీల ద్రోహి.. జనసేన నేత పోతిన మహేశ్ కామెంట్స్..!

Wednesday, March 31st, 2021, 03:12:42 AM IST


ఏపీ సీఎం జగన్‌పై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం జగన్ బీసీల ద్రోహి అని అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 20 వేల మంది బీసీలను జగన్ మోసం చేశారని ఆరోపించారు. కేవలం 20 మందికి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఇచ్చి బీసీలను జగన్ మాయ చేశారని అన్నారు. ఏపీలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై బీసీల నేత ఆర్.కృష్ణయ్య పోరాడాలని అన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్న జగన్‌పై బీసీల తిరుగుబాటు తప్పదని అన్నారు. ఈబీసీ రిజర్వేషన్ 10 శాతం అమలు చేయకపోవడంపై సీఎం జగన్ ఎందుకు స్పందించడంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.