గుజరాత్ లో పోస్టర్ల రగడ

Friday, January 9th, 2015, 11:38:51 PM IST


గుజరాత్ లోని గాంధి నగర్ ప్రవాస భారతీయ దివస్ కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం భారీ ఏర్పాట్లు కూడా చేశారు. గత రెండు రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సైతం మోడీ ఆహ్వానించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ రోజు ప్రవాస భారతీయ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న విషయం విదితమే.

ఇదిలా ఉంటే, ఈ కార్యక్రమంలో హాజరు కావలసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హాజరు కాలేదు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో, ఆయన హాజరుకాలేక పోయినట్టు తెలుస్తున్నది. ఇక, గుజరాత్ లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పోస్టర్లు తొలగించడంతో సమాజ్ వాది పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో పెద్ద రాష్ట్రానికి అవమానం జరిగే విధంగా మోడీ సొంతరాష్ట్రం వ్యవహరిస్తున్నదని సమాజ్ వాది పార్టీ నాయకులు అంటున్నారు. గుజరాత్ రాష్ట్రం గురించి ప్రధాని మోడీ గొప్పగా చెప్పుకుంటారని, కాని, గుజరాత్ లో బీజేపి కార్యకర్తలు, ఆయన మద్దతు దారులు యూపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పోస్టర్లు పీకేశారని యూపి ఎంపి ధర్మేంద్ర యాదవ్ అన్నారు.