గ్రేటర్ ఎన్నికలలో టీఆర్ఎస్ను గెలిపించాలని నటుడు పోసాని కృష్ణమురళి ప్రజలను కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన పోసాని తన జీవితంలో ఎన్నో ప్రభుత్వాలను చూశానని కానీ కేసీఆర్ లాంటి పట్టుదల సీఎంని చూడలేదని అన్నారు. మత సామరస్యం కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు. తెలంగాణ వచ్చాక ఏపీ ప్రజలపై ఎలాంటి దాడులు జరగలేదని, అన్ని ప్రాంతాల వారిని ఆయన సమానంగా చూశారని చెప్పుకొచ్చారు.
అయితే హైదరాబాద్‌లో గత వందేళ్లలో ఎప్పుడూ రానంత స్థాయిలో వరదలు వచ్చాయని, ఆ స్థాయిలో వరదల వస్తే ఎవరైనా ఏం చేయలేరని అన్నారు. అయినప్పటికి వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ పరితపించారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో శాంతిభద్రతలు ఎంతో మెరుగ్గా ఉన్నాయని అన్నారు. తెలంగాణలో గతంలో తాగు, సాగునీటి సమస్యలు, విద్యుత్ కోతలు ఉండేవని కానీ ఇప్పుడు ఆ సమస్యలు లేవని అన్నారు. అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించాలని, తన మద్దతు కూడా టీఆర్ఎస్కే ఉంటుందని పోసాని చెప్పుకొచ్చారు.