దుబ్బాక కు కేసీఆర్ ఎన్నిసార్లు వచ్చారు

Friday, October 9th, 2020, 05:50:21 PM IST

దుబ్బాక ఉపఎన్నిక అధికార, ప్రతి పక్ష పార్టీ లకు ప్రతిష్టాత్మకంగా మారింది. అధికార పార్టీ మరోమారు తన జెండా ఎగుర వేయాలని భావిస్తూ ఉండగా, ప్రతి పక్ష పార్టీ కాంగ్రెస్ సైతం ఈసారి కచ్చితంగా గెలవాలని చూస్తోంది. అయితే అధికారం పార్టీ తీరు పై టిపిసిసి కార్య నిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక లో తెరాస ప్రభుత్వం అభివృద్ది చేసి ఉంటే కాంగ్రెస్ ను చూసి ఎందుకు హరీష రావు భయ పడుతున్నారు అని అన్నారు.

అయితే హరీష రావు లాంటి అబద్దాల కోరు ను నమ్ముకుంటే మునిగిపోతారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో హరీష రావు ఉప ఎన్నికల్లో ప్రచారం చూస్తే తెలుస్తోంది అని అన్నారు. దుబ్బాక కి కేసీఆర్ ఎన్నిసార్లు వచ్చారు అంటూ సూటిగా ప్రశ్నించారు. సిద్దిపేట పై ఉన్న ప్రేమ దుబ్బాక పై ఎందుకు లేదు అని తెలిపారు. దుబ్బాక లో ఏ గ్రామం కి అయినా వెళ్దాం, ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయా, డబుల్ బెడ్ రూం ఇల్లు ఉన్నాయా చూద్దాం అంటూ సవాల్ విసిరారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాలకు మీరు రావొద్దు, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఉన్న గ్రామాలకు మేము రాము అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక లో తెరాస గెలిచే అవకాశం ఉంటే కాంగ్రెస్ నాయకులను ఎందుకు చేర్చుకుంటున్నారు అని నిలదీశారు.