ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికల పై టీడీపీ, బీజేపీ నేతల కీలక వ్యాఖ్యలు

Wednesday, October 28th, 2020, 11:55:07 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మరొకసారి స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలు కానుంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిర్వహణ పై వివిధ పార్టీలకు చెందిన అభిప్రాయాలను సేకరించారు. అయితే ఈ పార్టీల అభిప్రాయ సేకరణ లో వైసీపీ గైర్హసరు అయిన సంగతి తెలిసిందే.

అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల గతంలో కరోనా వైరస్ మహమ్మారి కారణం గా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే గతంలో పలు చోట్ల ఎన్నికలు ఏకగ్రీవం కూడా అయ్యాయి. అయితే వాటిని రద్దు చేసి మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలి అంటూ టీడీపీ, నేతలు అంటున్నారు. అయితే సిపి ఐ నేత రామకృష్ణ సైతం మళ్లీ కొత్తగా నోటిఫికేశన్ ఇవ్వాలి అంటూ ఎన్నికల కమిషనర కి సూచించారు. కరోనా వైరస్ దృష్ట్యా ఎన్నికల నిర్వహణ జాగ్రత్తగా నిర్వహించాలి అని, పోలీసుల రక్షణ కూడా ఉండాలి అని ఎన్నికల కమిష నర్ కి సూచించారు.