టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ దీక్ష భగ్నం చేసిన పోలీసులు

Tuesday, February 16th, 2021, 08:25:23 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామిక అభివృద్ధి లో కీలక భూమిక పోషించిన విశాఖ ఉక్కు పరిశ్రమ ను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రైవేటీకరణ కి వ్యతిరేకంగా తెలుగు దేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్ష జరుగుతున్న ప్రాంతం నుండి అక్కడే నగరం లోని కృషి ఐకాన్ ఆసుపత్రి కి పోలీసులు తరలించారు. అయితే ఈ నెల 10 వ తేదీ నుండి ఆమరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. పల్లా శ్రీనివాస్ రావు దీక్ష కి సంఘీభావం తెలిపేందుకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ రానున్నారు. అయితే చంద్రబాబు పర్యటన కి ముందే ఇలా జరగడం పట్ల సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. పల్లా శ్రీనివాస్ తలపెట్టిన దీక్షకు పలువురు టీడీపీ నేతల తో పాటుగా, ఇతరులు మద్దతు తెలిపారు. అమరావతి ప్రాంత రైతులు సైతం మద్దతు తెలిపేందుకు విశాఖ వెళ్లిన సంగతి తెలిసిందే.