కోటి విలువైన మాస్కుల పట్టివేత…ఎక్కడో తెలుసా?

Wednesday, March 25th, 2020, 07:20:51 PM IST

భారత దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్రలో పెద్ద ఎత్తున మాస్కులు పట్టుబడ్డాయి. అయితే ఈ మస్కుల విలువ దాదాపు కోటి రూపాయల కి పై మాటే అనే స్వాధీనం చేసుకున్న అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం భారతదేశం లాక్ డౌన్ లో ఉంది. నిత్యావసర వస్తువుల నిల్వలను అరికట్టడానికి జరిపిన దాడుల సమయంలో ఈ మస్కులు వెలుగు చూశాయి. ముంబై సబర్బన షా వేర్ హౌసింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ గౌడన్ లో దాడి చేయగా దాదాపు 200 బాక్సుల ఫేస్ మాస్కులని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఈ నిల్వలు ఉంచడం తో గౌడాన్ యజమాని, ఏజెంట మరియు వారికి సహకరించిన వారి పై కేసు నమోదు చేశారు పోలీసులు.