టీడీపీ నేత కొల్లు రవీంద్రకు షాక్.. నోటీసులు జారీ చేసిన పోలీసులు..!

Saturday, December 5th, 2020, 07:32:08 AM IST

మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రకు పోలీసులు షాక్ ఇచ్చారు. మంత్రి పేర్ని నానిపై తాపీ మేస్త్రీ జరిపిన దాడి కేసులో విచారణకు హాజరుకావాలని ఇనకుదురు సీఐ శ్రీనివాసరావు కొల్లు రవీంద్రకు నోటీసులు జారీ చేశారు. తొలుత కొల్లు రవీంద్ర ఇంటికి వచ్చిన సీఐ విచారణకు రావాలని కోరారు. ఈ కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని రవీంద్ర తేల్చి చెప్పారు.

ఈ సమయంలో డీఎస్పీ రమేశ్‌రెడ్డితో కూడా ఫోనులో మాట్లాడిన కొల్లు రవీంద్ర ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చడు. అయితే విచారణకు హాజర్ కావాలంటే ఏదైనా నోటీసు ఇస్తే వస్తానని చెప్పారు. దీంతో సీఐ నోటీసును తీసుకుని మళ్లీ కొల్లు రెవీంద్ర ఇంటికి వచ్చారు. దీనిపై ఆయన ఎండార్స్‌మెంట్ రాసి ఇచ్చారు. తనకు వ్యక్తిగత పనులున్నాయని, వారం రోజుల్లో విచారణకు హాజరవుతానని తెలిపారు.