పోలీస్ కమీషనర్ ఆనంద్ కు జాతీయ అవార్డు!

Thursday, January 22nd, 2015, 12:14:33 PM IST

Cv-anand
సార్వత్రిక ఎన్నికలలో ఉత్తమ పనితీరును ప్రదర్శించిన సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ కు కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ ప్రత్యేక అవార్డును బుధవారం ప్రకటించింది. కాగా ఎన్నికల సమయంలో నగదు రవాణాను అడ్డుకోవడం, పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహింపబడేలా చూడడం వంటి అంశాలకు గాను ఆనంద్ కు ఈ అవార్డు లభించింది. ఇక ఎన్నికలు జరిగిన 450జిల్లాలో అధికారుల పనితీరును పరిశీలించిన ఈసీ ఈ అవార్డుకు ఆనంద్ ను ఒక్కరినే ఎంపిక చేసింది.

ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ రెండు నెలల వ్యవధిలోనే వరుసగా ఎన్నికలు వచ్చాయని, మా సిబ్బంది తీరిక లేకుండా బందోబస్తు నిర్వహించడం వల్లనే నేడు దేశంలో సైబరాబాద్ పోలీసులకు గుర్తింపు లభించిందని, జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇక జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈనెల 25న ఢిల్లీలో ఈ అవార్డును ఆనంద్ కు అందజేయనున్నారు. కాగా ఎన్నికల సమయంలో సైబరాబాద్ పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 22కోట్ల రూపాయలను సీజ్ చేసిన సంగతి తెలిసిందే.