మాస్క్ ధరించని తెలంగాణ మాజీ ఎమ్మెల్యేకు జరిమానా?

Tuesday, May 11th, 2021, 03:42:07 PM IST

తెలంగాణలో కరోనా ఉదృతి పెరిగిపోతున్నప్పటికి ప్రజలు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. అయితే కరోనా జాగ్రత్తల గురుంచి ప్రజలకు చెప్పే బాధ్యత గల నాయకులు కూడా మాస్కులు లేకుండా రోడ్లపైకి వస్తున్నారు. మాస్క్ లేకుండా కారులో వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే తీగ కృష్ణారెడ్డికి పోలీసులు చలానా విధించారు.

అయితే హైదరాబాద్‌లోని కర్మాన్‌ఘాట్ చౌరస్తా వద్ద తనిఖీలు చేపట్టిన సరూర్ నగర్ పోలీసులు మాస్కు లేకుండా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కారులో వెళుతుండటాన్ని గమనించిన పోలీసులు కారును ఆపి తీగలకు 1000 రూపాయలు జరిమానా విధించారు. అయితే మాస్క్ పెట్టుకోవడం తన ఇష్టమని తీగల పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అయితే తమకు అందరూ సమానమేనని, కారులో ఉన్నా మాస్క్ పెట్టుకోవాల్సిందేనని తీగలకు పోలీసులు తేల్చి చెప్పారు.