బిగ్ న్యూస్: ఆకివీడు పోలీస్ స్టేషన్ లో నారా లోకేష్ పై కేసు నమోదు

Tuesday, October 27th, 2020, 10:39:05 AM IST

Nara_lokesh

నారా లోకేష్ పై ఆకివీడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. నారా లోకేష్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో నీ రైతుల ను పరామర్శించేందుకు, రైతులకి అండగా పోరాటం చేయడానికి , రైతులకి న్యాయం చేయడానికి ప్రభుత్వం ను డిమాండ్ చేయడం సీఎం జగన్ దృష్టిలో నేరం అని నారా లోకేష్ విమర్శించారు. అయితే ఈ నేరం పై కేసు పెట్టే సెక్షన్లు ఆయన వద్ద లేవు అని, అందుకే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘన మరియు,ట్రాక్టర్ నడిపారు అంటూ తన పై ఐపీసీ 279, 184, 54 ఏ మరియు అపిడమిక్ యాక్ట్ లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అంటూ నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే వరద బాధితులను పరామర్శించేందుకు గడప దాటని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గడప గడపకి వెళ్ళే నన్ను అడుగడుగునా అడ్డుకోవాలని అనుకుంటున్నారు అని నారా లోకేష్ మండిపడ్డారు. అయితే ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో, కష్టాలలో ఉన్నొల కన్నీళ్లు తుడిచేందుకు ప్రతి ఊరు వెళ్తా, ప్రతి గడప తొక్కుతా, బాధితులకు భరోసా ఇస్తా అని నారా లోకేష్ ఈ మేరకు తెలిపారు. అయితే మాస్క్ పెట్టుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి అందరూ అలానే కనిపిస్తారు అని, వెళ్లి కొత్త సెక్షన్లు వెతకాలి ప్రభుత్వం అంటూ టీడీపీ ఘాటు విమర్శలు చేస్తోంది.