తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ..!

Wednesday, December 9th, 2020, 12:00:39 AM IST

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మీద దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో భూ ఆక్రమణ కేసు నమోదైంది. మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుమారుడి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కుత్భుల్లాపూర్‌ మండలం సూరారంలోని తన భూమిని కబ్జా చేయించారని శ్యామలదేవి అనే మహిళ మల్లారెడ్డిపై పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తమ 20 గుంటల భూమిని మంత్రి మల్లారెడ్డి ఆయన కుమారుడు భద్రా రెడ్డి మరో ఐదుగురు కలిసి కబ్జా చేశారని ఆమె ఫిర్యాదులో తెలిపారు.

అయితే తన భూమి మల్లారెడ్డికి చెందిన ఆస్పత్రికి అనుకొని ఉండడంతో ఆ భూమిని విక్రయించాలంటూ బెదిరిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. కోర్టులో పిటిషన్ వేసిన లాయర్‌ను కూడా కొనేసి తెల్లకాగితంపై సంతకాలు తీసుకొని నకిలీ డాకుమెంట్స్ సృష్టించారని శారద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రికి అనుకుని ఉన్న 20 గుంటల భూమిని కబ్జా చేసి మంత్రి మల్లారెడ్డి ఆయన అనుచరులు ప్రహరీ గోడ నిర్మించారని ఆరోపించారు. తమ భూమిని ఆక్రమించడమే కాకుండా వాటికి నకిలీ పత్రాలు సృష్టించి తమ భూమిలోకి తమనే అడుగు పెట్టనివ్వడంలేదని ఫిర్యాదు చేసింది.