గ్రేటర్ ఎఫెక్ట్: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కేసు నమోదు..!

Thursday, November 26th, 2020, 09:13:43 PM IST

బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై హైదరబాద్‌లోని ఓయూ పీఎస్‌లో కేసు నమోదైంది. ఇటీవల తేజస్వి సూర్య గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే అనుమతులు లేకుండా క్యాంపస్‌లోకి ప్రవేశించారని, నిబంధనలకు విరుద్ధంగా సభ నిర్వహించారని తేజస్వి సూర్యపై ఓయూ రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే గ్రేటర్ ఎన్నికల ప్రచారాని వచ్చిన తేజస్వి సూర్య ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లోకి ప్రవేశించడానికి పోలీసుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతిని తీసుకోలేదు. అంతేకాకుండా విశ్వవిద్యాలయం అధికార యంత్రాంగం నుంచి కోడా ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఓయూ రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. అక్రమంగా తేజస్వి సూర్య క్యాంపస్‌లోకి ప్రవేశించారని లిఖితపూరక ఫిర్యాదు ఇచ్చారు. దీంతో తేజస్విపై పోలీసులు క్రిమినల్ ట్రెస్ పాసింగ్ కింద కేసు నమోదు చేశారు.