బిగ్ న్యూస్: టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు..!

Friday, May 7th, 2021, 06:58:07 PM IST


టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై కేసు నమోదయ్యింది. ఏపీలోని కర్నూలులో ఎన్440కే అనే కొత్త కరోనా స్ట్రెయిన్ గుర్తించారని, ఇది మరింత ప్రమాదకరమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే రాజకీయ దుమారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో కర్నూలు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారంటూ న్యాయవాది సుబ్బయ్య అనే వ్యక్తి కర్నూలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై ఐపీసీ 155, 505/1/బి/2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు 2005 ప్రకృతి వైపరిత్యాల చట్టంలోని సెక్షన్ 4 కింద నాన్‌బెయిలబుల్ కేసు కూడా నమోదు చేశారు.