కష్టాల్లో పడుతున్న ఖమ్మం DSP – హత్యాయత్నం కేసు నమోదు…?

Thursday, March 26th, 2020, 09:26:22 AM IST

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి భయంకరమైన కరోనా వైరస్ భారత దేశంలో కూడా దారుణంగా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో కరోనాఆ వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్రప్రభుత్వలు అన్నీ కూడా కీలకమైన కఠిన చర్యలను తీసుకుంటున్నాయి. కానీ ప్రభుత్వాలు పెట్టిన నిబంధనలకు విరుద్ధంగా ఖమ్మం జిల్లాకు చెందిన ఒక DSP అధికారి తన కుమారుడు లండన్ నుండి వచ్చిన వివరాలను దాచిపెట్టి, భయంకరమైన కరోనా వైరస్ వ్యాపించడానికి కారకుడయ్యాడు. దీంతో ఆ అధికారిపై పోలీసు కేసు నమోదయింది. తన తనయుడి వివరాలు వెల్లడించకుండా, హోం క్వారంటైన్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ పోలీస్ అధికారిపై తాజాగా హత్యాయత్నం కేసు నమోదు చేయాలంటూ డీఎంహెచ్ఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా ఇటీవల కాలంలో లండన్ నుండి హైదరాబాద్ కి వచ్చినటువంటి ఖమ్మం జిల్లా DSP కుమారుడు తన చేరుకున్నాడు. అక్కడినుండి పార్టీలకు, ఫంక్షన్లకు, బంధువుల దగ్గరికి వెళ్లి అందరిని కలుసుకున్నాడు. కానీ ఆ తరువాత అతడికి జరిపిన పరీక్షల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో అందరు అప్రమత్తమయ్యారు. కానీ అప్పటికే అతడి వల్ల DSP కి, వాళ్ళింట్లో పనిమనిషికి కూడా ఈ వైరస్ సోకిందని సమాచారం. ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎల్.భాస్కర్ నాయక్, సదరు DSP అధికారి, అతడి కుమారుడిపై పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలంటూ ఎస్పీ సునీల్‌దత్ ను కలిసి ఫిర్యాదు చేశారు.