రేవంత్ రెడ్డి, మల్లు రవి లను అరెస్ట్ చేసిన పోలీసులు

Saturday, August 22nd, 2020, 03:15:44 PM IST

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం లో నిన్న అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఘటన లో పలువురు మృతి చెందారు, వారి కుటుంబీకులను పరామర్శించేందుకు రేవంత్ రెడ్డి మరియు మాజీ ఎంపీ మల్లు రవి లు వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పు నూతల మండలంలోని లత్తి పూర్ పెట్రోల్ బంక్ వద్ద రేవంత్ రెడ్డి వాహనం ను ఆపి, అక్కడి నుంచి ఉంది పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. అయితే ఈ నేపధ్యంలో రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే అరెస్ట్ చేయాల్సింది తమను కాదు అని, ఘటనకు బాధ్యులు అయిన మంత్రి జగదీశ్ రెడ్డి, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు లను అంటూ పోలీసులకి తెలిపారు. జరిగిన ఘటన పై సీబీఐ విచారణ జరిపించాలి అని, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలి అని రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. అయితే బాధితులను పరామర్శించిన అనంతరం ఇక్కడ నుండి వెళ్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అనుమతి ఇవ్వాలి అని కోరారు.