మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను అరెస్ట్ చేసిన పోలీసులు

Thursday, March 11th, 2021, 10:09:07 AM IST

ex minister kollu ravindra
మచిలీపట్నం లో తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై పై చేయి చేసుకున్న ఘటన లో కొల్లు రవీంద్ర పై కేసు నమోదు అయింది. అయితే పురపాలక ఎన్నికల సందర్భంగా పోలీసులకు కొల్లు రవీంద్ర కి మధ్యలో వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే కొల్లు రవీంద్ర అరెస్ట్ తో మచిలీపట్నం లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హై టెన్షన్ వాతావరణం నెలకొనడం తో పోలీసులు భారీగా చెరుకుంటున్నారు. మరో పక్క కొల్లు రవీంద్ర ఇంటికి తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు భారీ గా చేరుకుంటున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే కొల్లు రవీంద్ర అరెస్ట్ ను టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.