బిగ్ న్యూస్: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అరెస్ట్

Tuesday, January 5th, 2021, 11:43:17 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో విజయ నగరం జిల్లాలో కోదండరామస్వామి విగ్రహం ధ్వంసం ఘటన కి నిరసన గా బీజేపీ మరియు జన సేన పార్టీ శ్రేణులు రామతీర్థం దర్మయాత్ర ఉద్రిక్తం గా మారింది. ఇప్పటికే పలువురు కీలక నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. మరి కొందరిని గృహ నిర్భంధం చేశారు. రామతీర్థం కూడలి వద్ద సెక్షన్ 30 అమలు లో ఉన్న కారణం చేత ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదు అని పోలీసులు ఆదేశాలను జారీ చేశారు. అయితే అక్కడికి వెళ్లేందుకు బయలుదేరిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ను పోలీసులు అడ్డుకున్నారు.

అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించిన సోము వీర్రాజు తో సహ పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే ఈ మేరకు సోము వీర్రాజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రామతీర్థం ధర్మ యాత్ర కి ముందుగానే పిలుపు ఇచ్చినప్పటికీ అనుమతి లేదు అని పోలీసులు అడ్డుకోవడం దారుణం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆలయ సందర్శనకు ముందు అనుమతి ఇచ్చి ఇలా అడ్డుకోవడం పట్ల మండిపడ్డారు. అయితే ఆలయ సందర్శనకు వైసీపీ కి, టీడీపీ కి అనుమతి ఇచ్చి ఇప్పుడు బీజేపీ, జన సేన లను అడ్డుకోవడం ఎంటి అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే గృహ నిర్భందం చేసిన బీజేపీ మరియు జన సేన నాయకులను వెంటనే విడుదల చేయాలని సోము వీర్రాజు అన్నారు.