అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రేపు ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్

Monday, November 23rd, 2020, 04:30:12 PM IST

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఇంకా దేశం లో కొనసాగుతూ నే ఉంది. అయితే రేపు ప్రధాని నరేంద్ర మోడీ రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశం లో అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత, అందుకు సంబంధించిన వివరాలను మోడీ తెలుసుకోనున్నారు. ముఖ్యం గా ఈ సమావేశం లో కరోనా వైరస్ వాక్సిన్ గురించి చర్చించనున్నారు.

వాక్సిన్ కి సంబంధించిన ప్రయోగాలు అన్నీ కూడా చివరి దశకి చేరుకోవడం తో వాక్సిన్ స్టోరేజ్ సామర్ధ్యం మరియు పంపిణీ వ్యహాల పై ఈ వీడియో కాన్ఫరెన్స్ జరగనుంది. అయితే ఈ సమావేశాన్ని రెండు విడతలుగా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రులతో చర్చ జరిపిన అనంతరం మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశం లో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలు మరియు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సూచనలు రేపు తెలియనున్నాయి.