ఈ నెల 29న హైదరాబాద్ రానున్న ప్రధాని మోదీ.. ఎందుకంటే?

Thursday, November 26th, 2020, 06:18:50 PM IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మోదీ హైదరాబాద్ హకీంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. హైదరాబాద్‌లో కరోనా వ్యాక్సిన్‌‌ను ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థను సందర్శించనున్నారు. భారత్ బయోటెక్‌లో వ్యాక్సిన్ పురోగతిని పరిశీలించనున్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ పూణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని సందర్శించనున్నట్టు సమాచారం.

అయితే భారత్‌లో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొన్న వీడియో కాన్పరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాకిన్‌ తయారీ, వ్యాక్సినేషన్‌ ప్రాధాన్యతలు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన విధానాలు, వ్యాక్సిన్ పంపిణీ సందర్భంలో అనుసరించాల్సిన పద్ధతులపై గురుంచి కూడా చర్చించారు. ఇదిలా ఉంటే గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రధాని మోదీ హైదరాబాద్‌లో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.