బండి సంజయ్ కి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్…ఏమన్నారంటే?

Wednesday, December 2nd, 2020, 04:04:22 PM IST


తెలంగాణ రాష్ట్రం లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈసారి బీజేపీ దూకుడుగా వ్యవహరించడం మాత్రమే కాకుండా, తెరాస కి గట్టి పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యం లో తెలంగాణ రాష్ట్రం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ కాల్ చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన విధానం మరియు పార్టీ పరిస్థితుల పై మాట్లాడినట్లు తెలుస్తోంది. నాయకులు మరియు పార్టీ కార్యకర్తల పై జరిగిన దాడుల వివరాల్ని బండి సంజయ్ ను మోడీ అడిగి తెలుసుకున్నారు.

అయితే పార్టీ ను అన్ని విధాలుగా విజయ తీరాలకు చేర్చేందుకు అన్ని విధాలుగా పోరాడిన కార్యకర్తల పోరాట పటిమను మోడీ అభినందించినట్లు చెప్పుకొచ్చారు. పార్టీ క్యాడర్ నూతనోత్సాహం తో నడుచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసినట్లు వివరించారు. అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ముందుకు సాగాలని, అన్ని విధాలుగా అండగా ఉంటామని బండి సంజయ్ కి నరేంద్ర మోడీ హామీ ఇచ్చిన విషయాన్ని వెల్లడించారు.