దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ కీలక సూచనలు!

Thursday, September 10th, 2020, 10:11:32 PM IST


భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న వేళ ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మాస్క్ లు ధరించి, భౌతిక దూరం పాటించాలి అని కోరారు. ఈ కరోనా వైరస్ మహమ్మారి ను అంత తేలిగ్గా తీసుకోవద్దు అని హెచ్చరించారు. అయితే కరోనా వైరస్ కి శాస్త్రవేత్తలు వాక్సిన్ కోసం ఎంతో శ్రమ పడుతున్నారు. అయితే వాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి అని, కనీసం రెండు గజాల దూరం పాటించాలి అని మోడీ తెలిపారు.

అయితే కుటుంబం లోని వయో వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలి అని సూచించారు. అంతేకాక బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయోద్దు అని ప్రజలకు తెలియజేశారు. ఇప్పటికే భారత్ లో వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. మరో పక్క వందల సంఖ్యలో కరోనా భారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అంటూ మోడీ సూచనలు చేస్తున్నారు. మానవాళికి పెను సవాలు గా మారిన ఈ మహమ్మారి ను అరికట్టడానికి తగు ప్రణాళిక చర్యలు తీసుకుంటామని అమిత్ షా తెలిపారు.