మన్ కీ బాత్ లో మోడీ రైతుల పై ప్రశంసలు… కళా రంగం అభివృద్ది కి కీలక సూచనలు!

Monday, August 31st, 2020, 12:00:24 AM IST

ఆత్మ నిర్భర్ భారత్ అంటూ దేశ ప్రజలను ప్రోత్సహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, నేడు మన్ కీ బాత్ లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికే వెన్నుముక రైతులు అని అందరికీ తెలిసిన విషయమే. అయితే కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న సమయం లో కూడా రైతులు కష్టపడి సాగు చేస్తున్నారు అని అన్నదాత ల పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఏడాది ఎక్కువ విస్తీర్ణం లో పంటలు సాగు చేస్తున్నారు అని మోడీ తెలిపారు.

అయితే పిల్లలు ఆడుకునే బొమ్మల విషయం లో మోడీ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ స్థాయిలో పిల్లలు అడుకొనెందుకు బొమ్మలను తయారు చేయాలి అని, అందుకోసం యువత ముందుకు రావాలి అని పిలుపు ఇచ్చారు. స్థానికంగా భారత్ లో ఉన్న కళలను, కళా కారులను ప్రోత్సహించాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత దేశం యొక్క కళా నైపుణ్యాలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలి అని అన్నారు. అయితే ఈ బొమ్మల పరిశ్రమ ద్వారా ఏటా 7 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యల తో భారత్ అన్నింటా స్వయం సమృద్ది దిశగా ముందుకి అడుగులు వేయాలని పరోక్షంగా పిలుపు ఇచ్చారు.