రైతులు స్వేచ్ఛగా అమ్ముకునేందుకు ఈ బిల్లులు సహకరిస్తాయి – ప్రధాని నరేంద్ర మోడీ

Monday, September 21st, 2020, 05:00:18 PM IST

ప్రధాని నరేంద్ర మోడీ మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా రైతులకి అనుకూలంగా తమ ఉత్పత్తులను స్వేచ్ఛగా అమ్ముకునేందుకు వీలుగా పలు వ్యవసాయ సంబంధిత బిల్లులను తీసుకు రావడం జరిగింది. అయితే ఈ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో ప్రధాని నరేంద్ర మోడీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

రైతులకు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకునెందుకు ఈ బిల్లులు ఉపకరిస్తాయి అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అయితే వ్యవసాయ మార్కెట్ లకు ఈ బిల్లులు ఏ మాత్రం కూడా వ్యతిరేకం కాదు అని అన్నారు స్పష్టం చేశారు. రైతుల శ్రేయస్సు కోసం ఈ బిల్లులను ప్రవేశ పెట్టడం జరిగింది అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తమ ఉత్పత్తులను ఎక్కడైతే అధిక లాభం వస్తుంది అని భావిస్తారో, అక్కడే వెళ్లి స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.

అయితే ఈ బిల్లు ద్వారా కనీస మద్దతు ధర వ్యవస్థ కి ఏ ప్రమాదం ఉండదు అని అన్నారు, అంతేకాక కనీస మద్దతు ధర వ్యవస్థ యధాతథంగా కొనసాగుతుంది అని స్పష్టం చేశారు. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ నిర్ణయం పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. తెరాస నేతలు తీరును తప్పుబడుతూ బీజేపీ నేతలు వరుస విమర్శలు చేస్తున్నారు.