దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చిన ప్రధాని మోదీ..!

Thursday, April 8th, 2021, 11:21:01 PM IST


దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్న నేపధ్యంలో వైరస్ కట్టడి, వాక్సినేషన్ పంపిణీ వంటి అంశాలపై నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కరోనా కట్టడికి కావాల్సిన మౌలిక వసతులు, వ్యూహాలు లేకపోవడంతోనే లాక్‌డౌన్ విధించాల్సి వచ్చిందని కానీ ప్రస్తుతం దేశంలో లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ మంచి ప్రత్యామ్నాయం అని అన్నారు.

అయితే రెండో దశలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఊందని, పెరుగుతున్న కేసులను చూసి భయపడవద్దని, టెస్టుల సంఖ్యను పెంచాలని సూచించారు. ప్రజలు కరోనాను సీరియస్‌గా తీసుకోవట్లేదని మాస్క్, భౌతిక ధూరం నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని అన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్‌గఢ్, పంజాబ్, వంటి పలు రాష్ట్రాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. కరోనా కట్టడికి రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. కరోనా కట్టడికి రాత్రి పూట కర్ఫ్యూ విధించడం మంచిదేనని, రాష్ట్రాల్లో రాత్రి 9 నుంచి తెల్లవారు వరకు 5 వరకు నైట్ కర్ఫ్యూ పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. రాత్రి కర్ఫ్యూకు బదులుగా కరోనా కర్ఫ్యూ అని పిలవాలని ప్రధాని సూచించారు. 45 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని, దేశ ప్రజలు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని మోదీ స్పష్టం చేశారు.