సీఎం జగన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

Monday, December 21st, 2020, 08:50:09 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని, చిరకాలం మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రముఖులు, రాజకీయ నేతలు, అభిమానులు భారీగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరో పక్క వైసీపీ నేతలు నేడు పలు కార్యక్రమాలు చేపట్టారు. ప్రజల అభివృద్ది కోసం, శ్రేయస్సు కోసం పాటుపడుతున్న నాయకుడు జగన్ అంటూ అభిమానులు కొనియాడుతున్నారు.