ప్రధాని నరేంద్ర మోడీ మరో అరుదైన ఘనత

Thursday, October 8th, 2020, 12:54:00 AM IST

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో కీలక మైలు రాయి ను అధిగమించారు. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా సుదీర్ఘ కాలం కొనసాగిన నరేంద్ర మోడీ, ప్రధాని గా రెండోసారి పగ్గాలు చేపట్టారు. అయితే ఎన్నికైన ఒక ప్రభుత్వ నేత అత్యధిక కాలం పని చేసిన వారి సరసన ప్రధాని నరేంద్ర మోడీ చేరారు. అయితే బుదవారం తో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాధినేత గా 20 వ సంవత్సరం లోకి అడుగు పెట్టారు. అయితే ప్రపంచం లోనే ఎన్నికైన ప్రభుత్వాధినేత గా సుదీర్ఘ కాలం పని చేసిన వారిలో ప్రధాని నరేంద్ర మోడీ ఒకరు అని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

అయితే నరేంద్ర మోడీ సాధించిన ఈ ఘనత ప్రతి భారతీయ పౌరుడి కి గర్వ కారణం అని రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. అయితే భారత్ తో పాటుగా ప్రపంచం శాంతి సౌఖ్యాల తో విలసిల్లే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ మరింత శక్తిని పొందాలి అంటూ ఆకాంక్షించారు. అయితే ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి గా దీర్ఘ కాలిక ప్రభుత్వాధినేత గా పనిచేసిన ప్రధాని నరేంద్ర మోడీ ను బిల్ క్లింటన్, జార్జి బుష్, ఫ్రాంక్లిన్ రుజ్ వెల్ట్ వంటి నేతలతో రవి శంకర్ ప్రసాద్ పోల్చారు. నరేంద్ర మోడీ కి ట్విట్టర్ వేదిక గా పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.