కరోనా టీకా డ్రైవ్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. సమయం ఫిక్స్..!

Friday, January 15th, 2021, 02:00:16 AM IST


యావత్ దేశమంతా ఉత్కంఠగా దేనికోసం ఎదురుచూస్తుందో ఆ క్షణాలు రానే వచ్చేశాయి. ఈ నెల 16వ తేదిన ఉదయం 10:30 గంటలకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని మోదీ వర్చువల్ విధానం ద్వారా కరోనా టీకా డ్రైవ్‌ను ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే తొలిరోజు 3 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు అందించనున్నట్టు సమాచారం.

దేశవ్యాప్తంగా మొత్తం 3,006 కేంద్రాల్లో టీకా పంపిణీ ప్రారంభమవుతుందని, మరోవైపు తొలిరోజు ప్రతి కేంద్రంలో కనీసం 100 మందికి టీకాను ఇవ్వబోతున్నారు. తదుపరి దశల్లో వ్యాక్సిన్ కేంద్రాల సంఖ్యను 5 వేలకు పెంచనున్నట్టు కేంద్రం తెలిపింది. తొలిదశలో 30 మిలియన్ల హెల్త్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు తెలిపింది. అయితే వ్యాక్సిన్ పంపిణీపై ఏదైనా సందేహాలు ఉంటే 1075 ట్రోల్ ఫ్రీ నెంబర్‌కి ఫోన్ చేయొచ్చని తెలిపింది.