జల సంరక్షణ ఉద్యమానికి ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం

Monday, March 22nd, 2021, 03:49:59 PM IST

భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ జల సంరక్షణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రపంచ జల దినం సందర్భంగా జల శక్తి అభియాన్ వర్షపు నీటిని ఒడిసిపట్టు అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అయితే దేశ ప్రజలందరికీ నీటి సంరక్షణ పై అవగాహన కల్పించడం కొరకు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. అయితే ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వర్షం ఎక్కడ, ఎప్పుడు పడినా, ఆ నీటిని ఒడిసి పట్టుకొండి అంటూ చెప్పుకొచ్చారు. రానున్న వంద రోజులు ఒక మిషన్ లా పని చేయాలని సూచించారు.వర్షం పడిన చోట నీళ్ళు ఇంకి పోయేలా ప్రతి ఒక్కరూ పని చేయాలి అని వ్యాఖ్యానించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ద్వారా 62 లక్షల మందికి సురక్షిత త్రాగు నీరు అందుబాటులో ఉంటుంది అని తెలిపారు. అంతేకాక 103 మెగా వాట్ల జల విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.