సీఎం జగన్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ.. వరద పరిస్థితిపై ఆరా…!

Thursday, October 15th, 2020, 12:27:36 AM IST


తెలుగు రాష్ట్రాలలో వాయుగుండం ఏర్పడ్డ కారణంగా రెండ్రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే సీఎం జగన్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ ఏపీలో వరద పరిస్థితి గురుంచి అడిగి తెలుసుకున్నారు. అయితే వాయుగుండం తీరం దాటడంతో ఏపీలో భారీగా వర్షాలు పడ్డాయని, నెమ్మదిగా మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు. అలాగే అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను గురుంచి కూడా జగన్ మోదీకి వివరించారు.

ఇటు తెలంగాణలోని హైదరాబాద్‌తో సహా పలు జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురిశాయి. అయితే నగరంలోని చెరువులు, డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలలోని చాలా కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలువురు వరద నీటిలో చిక్కుకుని గల్లంతు కాగా, కొన్ని కార్లు బైకులు నీటి ఉదృతికి కొట్టుకుపోయాయి.