బిగ్ న్యూస్: భారత్ లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ లకు డీసీజిఐ అనుమతి…మోడీ ఏమన్నారంటే?

Sunday, January 3rd, 2021, 03:45:27 PM IST

ప్రపంచ వ్యాప్తంగా అందరినీ భయపెడుతున్న కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టేందుకు భారత్ సమాయత్తం అవుతుంది. హైదరాబాద్ కి చెందిన భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కొవాగ్జిన్ మరియు సీరం ఇన్స్టిట్యూట్ అభివృద్ది చేసిన కోవిషీల్డ్ లకు భారత్ లో డిసిజిఐ ఆమోదం తెలిపింది. షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది. అయితే ఆదివారం నాడు ఇందుకు సంబంధించిన ప్రకటన చేసింది డీసీజిఐ. అయితే భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి కి టీకా అందుబాటులోకి రావడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీని పట్ల ప్రధాని నరేంద్ర మోడీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

టీకా అందుబాటులోకి రావడం తో కరోనా పై యుద్ధం కీలక మలుపు తిరిగింది అని తెలిపారు. సీరం ఇన్స్టిట్యూట్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్ మరియు భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ కి డీసీ జీ ఐ ఆమోదం తెలపడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం భారత్ ఆరోగ్యవంతమైన కోవిడ్ రహిత దేశంగా మార్చేందుకు సహకరిస్తుంది అని అన్నారు. దేశ ప్రజల కోసం వాక్సిన్ ను అభివృద్ది చేసిన శాస్త్రవేత్తలకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు. అయితే అనుమతులు వచ్చిన రెండు టీకాలు కూడా భారత్ లోనే తయారు కావడం గర్వ కారణం అని మోడీ పేర్కొన్నారు.

అయితే ఆత్మ నీర్భర్ భారత్ కలను సాకారం చేసేందుకు ఎంత ఉత్సాహం గా ఉన్నారో తెలిపేందుకు ఈ ఘటన ఉదాహరణ అంటూ భారత శాస్త్రవేత్తల పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాక వైద్యులు, వైద్య సిబ్బంది, శాస్త్రవేత్తలు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు మిగిలిన కరోనా వారియర్స్ కి కష్టకాలం లో కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంతోమంది ప్రాణాలను కాపాడినందుకు మనందరం వారికి ఋణపడి ఉన్నాం అంటూ మోడీ అన్నారు.