కరోనా వైరస్ ప్రమాదం ఇంకా కొనసాగుతూనే ఉంది – మోడీ

Tuesday, October 13th, 2020, 02:43:25 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే గడిచిన 24 గంటల్లో భారత్ లో 55,342 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే చాలా కనిష్ఠ స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత రెండు నెలల క్రితం నమోదు అయిన తరహాలో కనిష్టంగా నమోదు అయ్యాయి. అయితే ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనా వైరస్ మహమ్మారి విషయం లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి అని మోడీ ప్రజలకు సూచించారు. వాక్సిన్ వచ్చే వరకు అందరూ అప్రమత్తం గా ఉండాలి అని, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా వైరస్ నిబంధనలను పాటించాలి అని తెలిపారు. అంతేకాక వైరస్ ముప్పు మనల్ని వెంటాడుతూనే ఉంది అని తెలిపారు. కరోనా వైరస్ నిబంధనల విషయం లో అలసత్వం పనికి రాదు అని హెచ్చరించారు. కరోనా వైరస్ ప్రమాదం ఇంకా కొనసాగుతూనే ఉంది అని, మహారాష్ట్ర లో పరిస్తితి ఆందోళన కరంగా ఉంది అని, వాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు.