చైనాకు మరో షాక్ ఇచ్చిన ప్రధాని మోదీ..!

Thursday, July 2nd, 2020, 02:14:57 AM IST


భారత ప్రధాని మోదీ చైనాకు మరో షాక్ ఇచ్చారు. ఇటీవల చైనాతో గాల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో భారతదేశానికి చెందిన ఓ కల్నల్‌ సహా 20 మందికి జవాన్లు మృతువ్యాత పడిన సంగతి తెలిసిందే. దీంతో చైనాకు బుద్ధి చెప్పేందుకు మరియు దేశ రక్షణ, భద్రతను దృష్టిలో పెట్టుకొని టిక్‌టాక్‌ సహా మరో 58 చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేదం విధించింది.

అయితే తాజాగా చైనాకు మరో షాక్ ఇచ్చేలా మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా సోషల్ మీడియా వైబో నుంచి తప్పుకున్నారు. 2015 నుంచి వైబోలో పెట్టిన ఫోటోలు, కామెంట్లు, పోస్టులు, ప్రొఫైల్ పిక్‌తో సహా అన్ని వివరాలను తొలగించారు. కాగా వైబోలో ప్రధాని మోదీకి 2.44 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా అందులో ఎక్కువ మంది చైనీయులే ఉండడం విశేషం.