మోడీ విదేశీ పర్యటన షురూ..!

Monday, March 16th, 2015, 10:25:23 AM IST

modi
ప్రధాని మోడీ ఐరోపా దేశాల పర్యటన షురూ అయింది. మోడీ వచ్చే నెలలో ఐరోపా దేశాలలో పర్యటించనున్నారు. జర్మనీ, ఫ్రాన్స్, కెనడా దేశాలలో మోడీ పర్యటించనున్నారు. ఐరోపా సమాఖ్యకు భారత్ ఈ మేరకు ప్రతిపాదనను పంపింది. అయితే, బెల్జీయం పర్యటనకు సంబంధించి ఆ దేశం నుంచి సమాధానం రాకపోవడంతో… బెల్జియం పర్యటను పక్కన పెట్టినట్టు తెలుస్తున్నది. ఐరోపా దేశాలతో సన్నిహిత సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు… మెక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్ లో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని తెలుస్తున్నది. జర్మనీ ఇప్పటికే పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఆ దేశ పారిశ్రామిక వేత్తలతో మాట్లాడి… భారత్ లో పెట్టుబడులను ఆకర్షించాలనేది మోడీ ప్రయత్నం అని చెప్పవచ్చు. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వానికి మద్దతు కోసం కూడా ఈ పర్యటన ఉపయోగపడుతుందని విశ్లేషకు అంచనా వేస్తున్నారు.